కరీంనగర్ అర్బన్: వంటగ్యాస్ అక్రమ వినియోగంపై సివి ల్ సప్లయ్ అధికా రులు ఆకస్మిక దా డులు నిర్వహించా రు. నగరంలోని హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వాడుతుండటంపై కన్నెర్ర చేశారు. సివిల్ సప్లయ్ డీటీ సురేందర్, ఎఫ్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి జ్యోతినగర్, మల్కాపూర్ రోడ్డు ప్రాంతాల్లోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసి 10 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వంటగ్యాస్ వాడితే కేసులు నమోదు చేస్తామని వివరించారు.
జగిత్యాలలో 17 సీజ్
జగిత్యాలక్రైం:జిల్లా కేంద్రంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ శాఖ అధికారులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 17 సిలిండర్లను పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశామని డీఎస్‌వో జితేందర్‌రెడ్డి తెలిపారు.
ఎస్‌యూ వీసీకి సత్కారం
కరీంనగర్ సిటీ: మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికి పీహెచ్‌డీ అందుబాటులోకి తీసుకుని వచ్చిన శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌కు శాతవాహన జేఏసీ చైర్మన్ చైతన్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు విభాగంలో పీహెచ్‌డీలు అందుబాటులోకి రావడంతో బుధవారం వీసీని ఘనంగా సత్కరించారు. చైతన్య, పలువురు పీహెచ్‌డీ స్కాలర్స్ మాట్లాడుతూ వీసీ ఉమేశ్‌కుమార్ ప్రత్యేక చొరవతో తెలుగు విభాగంలో పీహెచ్‌డీలు చేయడానికి అవకాశం వచ్చిందన్నారు. వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాలకు చిక్కిన పెద్దపులి
కొడిమ్యాల: మండలంలోని సూరంపేట, దమ్మాయిపేట శివారు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గ్రా మస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రైతు నరహరికి చెందిన ఆవును.. సో మవారం తేజావత్ గోరికి చెందిన చూడి ఆవును చంపిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పులి మొదట చంపిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చింది. ఈ దృశ్యం సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యింది. పులి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండడంతో ఆవాసం ఏర్పరచుకుందని సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు అలాంటిదేం లేదంటున్నారు.


