పీఎంశ్రీ విద్యార్థులకు స్పెల్‌బీ | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ విద్యార్థులకు స్పెల్‌బీ

Mar 18 2026 7:48 AM | Updated on Mar 18 2026 7:48 AM

పీఎంశ్రీ విద్యార్థులకు స్పెల్‌బీ సేంద్రియ సాగుతో లాభాలు పశు టీకాలు వేయించాలి బకాయిలు చెల్లించాలి

కరీంనగర్‌టౌన్‌: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పురాతన పాఠశాలలో జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం జిల్లాస్థా యి మాడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ స్పెల్‌బీ పరీక్ష నిర్వహించారు. 22 పాఠశాలల నుంచి 40మంది విద్యార్థులు హాజరయ్యారు. 11మందిని రా ష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రెండో విడత కార్యక్రమానికి 36మంది హాజరు కాగా పది మంది ని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ న్యాయ నిర్ణేతలుగా బి.తిరుపతి, ఏ.కుమారస్వామి. ఆర్‌.పవన్‌ కుమార్‌, స్పెల్‌బీ నిర్వహణకు వినయధర్‌ రాజు, శివకుమార్‌, మంజుర్‌ అలీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌రెడ్డి ఉన్నారు.

కరీంనగర్‌రూరల్‌: సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పంట దిగుబడులు పెరుగుతాయని జిల్లా వ్యవసాయాధికారి జె.భాగ్యలక్ష్మి అన్నా రు. మంగళవారం కరీంనగర్‌ మండలం మొ గ్ధుంపూర్‌ రైతువేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో ప్రధాన వరి రకాలు,సహజ వ్యవసాయం, నూనెగింజలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఏవో మాట్లాడుతూ రసాయన రహిత వ్యవసాయంతో నేల ఆరోగ్యంగా ఉంటుందని, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే అవకాశముందన్నారు. సర్పంచు మా దాసు సీనమ్మ, ఉపసర్పంచు కూకట్ల రమేశ్‌, ఏడీఏ రణధీర్‌కుమార్‌, ఏవో సత్యం, ఏఈవో లు స్వర్ణలత, ఉదయ్‌, సాయికిరణ్‌ ఉన్నారు.

చిగురుమామిడి: రైతులు తమ పశువులకు గా లికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాల ని జిల్లా పశుసంవర్థశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లింగారెడ్డి సూచించారు. మంగళవారం రేకొండలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 92,500 పశువులకు ఇప్పటి వరకు 14,468 పశువులకు టీకాలు వేశామన్నారు. పశువులను మండు వేసవిలో జాగ్రత్తగా కాపాడాలన్నారు. మండల పశువైద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, వెట ర్నరీ అసిస్టెంట్లు సత్యం, శ్రీనివాస్‌ ఉన్నారు.

కరీంనగర్‌టౌన్‌: రాష్ట్రంలోని రిటైర్డ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావల్సిన బకాయిలు చెల్లించాలని రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ కోహెడ చంద్రమౌళి డిమాండ్‌ చేశారు. స్థానిక పెన్షనర్‌ భవన్‌లో మంగళవారం మాట్లాడుతూ 2024 మార్చి నుంచి రిటైర్మెంట్‌ అయినవారికి రావల్సిన బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. బకాయిల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినా చలనం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతినెలా రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ రిటైర్మెంట్‌ అయిన వాళ్లకు అందడం లేదన్నారు. సంఘం బాధ్యులు కనపర్తి దివాకర్‌, జి.రవీందర్‌రావు, ప్రభాకర్‌, కిషన్‌, సుధాకర్‌, రవీందర్‌, శంకర్‌, సత్తయ్య, ఆనందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement