కేడీసీసీబీకి దేశవ్యాప్త కీర్తి | - | Sakshi
Sakshi News home page

కేడీసీసీబీకి దేశవ్యాప్త కీర్తి

Mar 18 2026 7:48 AM | Updated on Mar 18 2026 7:48 AM

● ఏడాదికో అవార్డు.. ఇప్పటికి 9 సొంతం ● అత్యుత్తమ సంఘంగా చొప్పదండి పీఏసీఎస్‌

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌ సహకార బ్యాంకు(కేడీసీసీబీ) మరో ఖ్యాతి గడించింది. దేఽశంలోనే ఫస్ట్‌ బెస్ట్‌ ఫర్ఫిమింగ్‌ డీసీసీబీ ఇన్‌ ఇండియా(2024–25) అవార్డును అందుకుంది. మంగళవారం సిక్కింలో ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ మంత్రి అరుణ్‌ ఉప్రేటీ చేతుల మీదుగా బ్యాంకు సీఈవో నందెల్లి సత్యనారాయణరావు స్వీకరించారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్‌ డా.సతీశ్‌ మటాథే, నాఫ్క్సాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, ఎండీ భీమాసుబ్రహ్మణ్యం బ్యాంకు విజయాన్ని ప్రశంసించారు. జనరల్‌ మేనేజర్లు బి.శ్రీధర్‌, ఎం.డి.రియాజోద్దీన్‌, డీజీఎం బ్రహ్మనందరావు పాల్గొన్నారు. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అత్యుత్తమ సంఘంగా అవార్డు పొందగా, కా ర్యదర్శి బద్దం రాజేందర్‌ అవార్డును స్వీకరించారు.

పతనం నుంచి అగ్రస్థానానికి

2005– 06 సంవత్సరంలో రూ.57.92కోట్ల నష్టాలతో ఉన్న కేడీసీసీబీ కొండూరు రవీందర్‌రావు ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన నుంచి అనేక సంస్కరణలు చేపట్టారు. గతంలో రూ.402కోట్లుగా ఉన్న బ్యాంకు వ్యాపారం నేడు రూ.8వేల కోట్లకు చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ వినూత్న పథకాలతో వాణిజ్య బ్యాంకులకు గట్టి పోటీనిస్తోంది. సుదీర్ఘ కాలం ఛైర్మన్‌గా సేవలందించిన కొండూరు రవీందర్‌రావు సూచనలు, సలహాలతో బ్యాంకు ఎంతగానో అభివృద్ధి సాధించిందని బ్యాంక్‌ సీఈవో సత్యనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement