కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు తలపెట్టిన 48 గంటల దీక్ష, ధర్నా, వంటావార్పు మంగళవారంతో విజయవంతమైంది. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముకుంద రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకుడు పుల్లెల మల్లయ్య దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18000 ఇవ్వాలన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారెళ్ల శ్రీలత, కాల్వ సారిక, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ, రజిత, సరిత, లత, జిల్లా సహాయ కార్యదర్శులు సుమలత, శ్యామల, సరోజన ఉన్నారు.


