తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు

Feb 1 2026 3:31 AM | Updated on Feb 1 2026 3:31 AM

తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు

తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు

● వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి ● కలెక్టర్‌ పమేలా సత్పతి ● ముగిసిన రోడ్డు భద్రతా మాసోత్సవాలు

తిమ్మాపూర్‌: మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు శనివారం ముగిశాయి. తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు పాటించాలన్నారు. సారథి రోడ్‌ సేఫ్టీ పార్క్‌లో ఇప్పటివరకు 22 వేల మందికి అవగాహన కల్పించామన్నారు. అదనపు డీసీపీ కె.వెంకటరమణ మా ట్లాడుతూ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. ఆర్టీఏ సభ్యుడు పడాల్‌ రాహుల్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్‌సేఫ్టీ అవగాహన కోసం రోడ్‌సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయడానికి డీఈవోలకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్‌ చక్రవర్తి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో 30రోజులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఆర్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సింహచారి, ఎంవీఐలు రవికుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement