పరిశీలన పూర్తి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో 66 డివిజన్ల నుంచి 736 మంది దాఖలు చేసిన 1257 నామినేషన్‌లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. నిబంధనల ప్రకారం లేని, సరైన పత్రాలు జతపరచని నామినేషన్లను తిరస్కరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయి, పరిశీలకుడు జి.జితేంధర్ రెడ్డి, మనోహర్ రిటర్నింగ్ కౌంటర్లను తనిఖీ చేసి స్క్రూటినీని పరిశీలించారు. నామినేషన్లు చెల్లుబాటు కాని అభ్యర్థులు ఆదివారం అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఈ పలువురు అభ్యర్థులపై ప్రత్యర్థులు ఫిర్యాదులు చేశారు. మహిళా అభ్యర్థులు తమ భర్తల పేరిట ఉన్న క్రిమినల్ కేసులు వివరాలు అఫిడవిట్‌లో పొందుపరచలేదని, రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. తమ ఫిర్యాదులపై అధికారులు స్పందించలేదని వాపోయారు.
పరిశీలన పూర్తి


