2.342 కిలోల వెండి పట్టగొలుసులు పట్టివేత
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద శనివారం వాహనాల తనిఖీల్లో భాగంగా 2.342 కిలోల వెండి పట్టగొలుసులు పట్టుకున్నట్లు ఎస్‌ఎస్‌టీ బృందం ఇన్‌చార్జి జి.ఆనంద్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలోనే జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన తొగిటి సత్యానారాయణ ఎలాంటి ఆధారాలు లేకుండా 2.342 కిలోల వెండి పట్టగొలుసులు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు వివరించారు. ఎస్సై శ్రీకాంత్, ఎన్నికల అధికారులు ఉన్నారు.


