సర్పంచ్‌ టు మేయర్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ టు మేయర్‌

Feb 1 2026 3:31 AM | Updated on Feb 1 2026 3:31 AM

సర్పం

సర్పంచ్‌ టు మేయర్‌

గీట్ల జనార్దన్‌రెడ్డి

మాలం మల్లేశం

మాతంగి నర్సయ్య

బడికెల రాజలింగం

సత్యనారాయణ

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ భౌగోళికంగా దినదినాభిదృద్ధి చెందింది. నోటిఫైడ్‌ ఏరియా నుంచి నగరపాలక సంస్థకు అంచలంచెలుగా ఎదిగింది.

చరిత్రలో మైలురాళ్లు

● 1982 జనవరి 19న జనగామ గ్రామపంచాయతీతోపాటు 11 గ్రామాలను ప్రభుత్వం విలీనం చేస్తూ రామగుండం నోటిఫైడ్‌ ఏరియాగా ప్రకటించింది.

● నోటిఫైడ్‌ ఏరియాగా గుర్తించక ముందు 11 వార్డులు కలిగిన పంచాయతీకి సర్పంచ్‌గా గీట్ల జనార్దన్‌రెడ్డి వ్యవహరించారు.

● 1982 జనవరి 19 నుంచి 1983 వరకు నోటిఫైడ్‌ ఏరియాకు అప్పటి ఆర్డీవో ద్వారా ప్రత్యేక పాలన జరిగింది.

● 1995 మే 15న రెండో శ్రేణి, 2001 ఆగస్టు 3న మొదటి శ్రేణి, 2003 నవంబర్‌ 3న ప్రత్యేక శ్రేణి పురపాలక సంఘంగా ఆవిర్భవించింది.

● 2010 ఫిబ్రవరి 25న నగరపాలక సంస్థగా రామగుండం ప్రత్యేక గుర్తింపు పొందింది.

● 1998 జూన్‌ 6న పురపాలక సంఘానికి మొదటిసారి, 2004 జూన్‌ 22న రెండోసారి ఎన్నికలు జరిగాయి.

● 2014 మార్చి 30న నగరపాలక సంస్థకు తొలిసారి, 2020 జనవరి 22న రెండోసారి ఎన్నికలు జరిగాయి.

నోటిఫైడ్‌ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు

● 1983 నుంచి 85 వరకు, 1989 నుంచి 94 వరకు నోటిఫైడ్‌ ఏరియా కమిటీ చైర్మన్‌గా అప్పటి ఎమ్మెల్యే మాతంగి నర్సయ్య రెండుసార్లు వ్యవహరించారు.

● 1985 నుంచి 1989 వరకు, 1995 నుంచి 1997 వరకు నోటిఫైడ్‌ ఏరియా కమిటీ చైర్మన్‌గా మాలెం మల్లేశం రెండుసార్లు వ్యవహరించారు.

మున్సిపల్‌ తొలి చైర్మన్‌గా ‘సోమారపు’

రామగుండం పురపాలక సంఘంకు 1998 జూన్‌ 6న ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగగా, తొలి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. 1998 జూన్‌ 6 నుంచి 2003 జూన్‌ వరకు మున్సిపల్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. కాగా, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో సమానంగా రామగుండంకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ, సోమారపు సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2004 వరకు కోర్టులో విచారణ ఉండడంతో అప్పటి వరకు రామగుండంకు ఎన్నికలు నిర్వహించలేదు.

2004లో బడికెల రాజలింగం

రామగుండం పురపాలక సంఘానికి మొదటిసారి జరిగిన ఎన్నికల తరహాలోనే 2004 జూన్‌ 22న ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగగా, చైర్మన్‌గా గెలుపొందిన బడికెల రాజలింగం 2009 జూలై 1 వరకు వ్యవహరించారు. అప్పటి నుంచి సకాలంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఐదేళ్లపాటు ప్రత్యేక పాలనలో కొనసాగింది.

తొలి మేయర్‌గా కొంకటి..

రామగుండం నగరపాలక సంస్థగా గుర్తింపు పొందిన తర్వాత 2014 మార్చి 30న తొలి ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. తొలి మేయర్‌గా కొంక టి లక్ష్మీనారాయణ వ్యవహరించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకొని మేయర్‌గా 2014 జూలై 3న ప్రమాణ స్వీకారం చేశారు. 2018 ఆగస్టు 2న లక్ష్మీనారాయణపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో పదవిని కోల్పోయారు. దీంతో 2019 జూలై 2 వరకు టీఆర్‌ఎస్‌ నుంచి చిట్టూరి రాజమణి మేయర్‌గా వ్యవహరించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజమణి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.

2020లో మేయర్‌గా అనిల్‌కుమార్‌

నగరపాలక సంస్థకు 2014లో జరిగిన ఎన్నికల్లో అప్పటి 12వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌ పోటీ చేసి ఓడిపోయా డు. 2020 జనవరి 22న జరిగిన ఎన్నికల్లో 30వ డివిజన్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 36 మంది కార్పొరేటర్లు మద్దతుతో అనిల్‌కుమార్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అనిల్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారు.

లక్ష్మీనారాయణ

రాజమణి

అనిల్‌కుమార్‌

ఆసక్తిగా రామగుండం రాజకీయం

బల్దియా అభివృద్ధిలో అనేక మైలురాళ్లు

సర్పంచ్‌ టు మేయర్‌1
1/7

సర్పంచ్‌ టు మేయర్‌

సర్పంచ్‌ టు మేయర్‌2
2/7

సర్పంచ్‌ టు మేయర్‌

సర్పంచ్‌ టు మేయర్‌3
3/7

సర్పంచ్‌ టు మేయర్‌

సర్పంచ్‌ టు మేయర్‌4
4/7

సర్పంచ్‌ టు మేయర్‌

సర్పంచ్‌ టు మేయర్‌5
5/7

సర్పంచ్‌ టు మేయర్‌

సర్పంచ్‌ టు మేయర్‌6
6/7

సర్పంచ్‌ టు మేయర్‌

సర్పంచ్‌ టు మేయర్‌7
7/7

సర్పంచ్‌ టు మేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement