రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Feb 1 2026 3:31 AM | Updated on Feb 1 2026 3:31 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని శ్రీచైతన్య స్కూల్‌ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన చాట్ల సాయికుమార్‌, గొట్టే శశిధర్‌ ఎల్లారెడ్డిపేట వైపు వస్తున్నారు. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై వస్తుండగా మండల కేంద్రం శివారులోని శ్రీచైతన్య స్కూల్‌ వద్ద వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని వేములవాడ మండలం అగ్రహారానికి చెందిన సయ్యద్‌ గోరిమియా క్షతగాత్రులను తన కారులోనే స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి పరారయ్యాడు. కారు యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

రామగుండం: అంతర్గాం మండలం ఎల్లంపల్లిలో ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాలు.. ఎల్లంపల్లికి చెందిన గోలివాడ లింగయ్య–ఓదమ్మ దంపతుల చిన్న కూతురు స్వరూపకు అదే గ్రామానికి చెందిన గుమ్ముల శ్రీనివాస్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కూమార్తెలు. కొంతకాలంగా శ్రీనివాస్‌ మద్యానికి బానిసై భార్యను వేధిస్తుండడంతో కుటుంబపోషణ భారంగా మారింది. భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నచ్చచెప్పినా అతడి పద్ధతిలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన స్వరూప శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

శతాఽధిక వృద్ధురాలు మృతి

ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు కడవేర్ల వీరమ్మ(107) తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి ఆమె స్వగృహంలో కన్నుమూశారు. వీరమ్మకు దాదాపు వందమందికి పైగా మనువలు, మనుమరాళ్లు, మునిమనువలు, మునిమనువరాళ్లు, కుటుంబసభ్యులతో కలిపి పెద్ద బలగం ఉంది. శనివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

రామగుండం: అంతర్గాం మండలం విలేజి అంతర్గాంకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాలు.. విలేజి అంతర్గాంలోని కాంపెల్లివాడకు చెందిన కాంపెల్లి గోపాల్‌(45) శుక్రవారం రాత్రి రోడ్డు దాటుతున్న క్రమంలో జాతర నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ తరలించే క్రమంలో మృతిచెందాడు. గోపాల్‌ మంచిర్యాల మున్సిపల్‌లో పారిశుధ్య కార్మికుడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో   ఇద్దరికి గాయాలు1
1/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో   ఇద్దరికి గాయాలు2
2/2

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement