యూరియా కోసం పడిగాపులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లోని సింగిల్‌విండో సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం శనివారం ఉదయమే చెప్పులు, పాసుపుస్తకాలు క్యూలైన్‌లో పెట్టి నిరీక్షించారు. యూరియా దోరుకుందో.. లేదోనని ఆందోళనతో ఏడు గంటలకే రైతులు సొసైటీ వద్దకు వచ్చారు. క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడలేక పాస్ పుస్తకాలు, చెప్పులు పెట్టారు. యూరియా లారీ రాగానే పంపిణీ చేసినప్పటికీ సగం మందికే సరిపోయాయి. నిరాశతో యూరియా బ్యాగులు దొరకకుండానే కొందరు రైతులు వెనుదిరిగారు.


