మూగబోయిన విప్లవ గొంతు | - | Sakshi
Sakshi News home page

మూగబోయిన విప్లవ గొంతు

Jan 31 2026 10:17 AM | Updated on Jan 31 2026 10:17 AM

మూగబోయిన విప్లవ గొంతు

మూగబోయిన విప్లవ గొంతు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విప్లవగొంతు మూగబోయింది. అణగారిన సమాజం కోసం పల్లెల్లో తిరిగి విప్లవ గేయాలు ఆలపించిన గాయకుడు గుంటి ఆగం(58) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో విషాదం నింపింది. దుమాలకు చెందిన గుంటి ఆగం విప్లవోద్యమంలో పల్లెల్లో తిరుగుతూ విప్లవగేయాలు ఆలపించేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పటి విప్లవోద్యమ సమయంలో ఉద్యమబాట పట్టి అనేక కాలం అజ్ఞాత జీవితం గడిపాడు. విప్లవగాయకుడిగా గుర్తింపు పొందారు. ఆగం అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో నిర్వహించనున్నారు.

అనారోగ్యంతో ఉద్యమనేత ఆగం మృతి

దుమాలలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement