దౌర్జన్యంగా మట్టి తీస్తుండ్రు
మేము సాగుచేసుకునే పంట చేలలో మట్టిని తీయడంతో ప్రభుత్వ భూమిగా భావించి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం మా భూమిలో సర్వే చేశారు. అది ప్రభుత్వ భూమి కాదు అని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుపోయాం. అధికారులు మట్టి తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలి. – దేశవేణి భూమేశ్, రుద్రంగి
చేనును పాడు చేసిండ్రు
మా చేనులో జేసీబీలతో మట్టిని తీసి పాడు చేసిండ్రు. మొత్తం బొందలగడ్డలుగా మారాయి. వర్షాకాలం పెసరు కూడా వేసుకోకుండా చేసిండ్రు. మా భూమిని ముందులాగా పెసర్లు సాగు చేసుకునేలా చేసి ఇచ్చేలా అధికారులు మట్టి తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– దేశవేణి నడ్పినర్సయ్య, రుద్రంగి
దౌర్జన్యంగా మట్టి తీస్తుండ్రు


