ఇదంతా ప్రజాసేవకేనా !
సిరిసిల్ల: నడిరేయి దాటింది. సిరిసిల్ల పట్టణ వీధులు నిర్మానుష్యంగా మారాయి. జనం ఆదమరిచి నిద్రపోతున్నారు. నేతకార్మికులు కొందరు సాంచాలు నడుపుతున్నారు. హఠాత్తుగా చరచరమంటూ మేఘం గర్జించింది. దిక్కులు దద్దరిల్లాయి. ఆ నిశ్శబ్ద ఛేదనతో దిగ్గున లేచారు జాతిపిత మహాత్మాగాంధీ. కొంచెం భయం.. భయంగా నలుదిక్కులూ తేరిపారచూశారు. ఎవరూ కనిపించకపోవడంతో చిన్నగా ముందుకెళ్లారు. ఎవరూ కనిపించలేదు. చేతిలో కర్ర పట్టుకొని చలికి వణుకుతూనే అడుగులో అడుగేస్తూ అంబేడ్కర్ విగ్రహం వైపు కదిలారు బాపూజీ. మెడనిండా పూలదండలు.. చేతిలో రాజ్యాంగ పుస్తకంతో అంబేడ్కర్ ఆదమరిచి నిద్రపోతున్నారు. నాయనా అంబేడ్కర్... అంటూ పిలి చాడు గాంధీజీ. చిన్నపాటి పిలుపునకే దిగ్గున లేచారు అంబేడ్కర్. బాపూజీ.. ఏమైంది. ఇంత రాత్రి ఆయాసపడుతూ వచ్చారంటూ కళ్లు తూడుచుకుంటూ.. గబగబా గాంధీతాత వద్దకు చేరారు. అప్పుడు వాళ్ల మధ్యలో ఇలా సాగింది సంభాషణ.
మంది, మార్బలంతో నామినేషన్లు
భారీ దర్పంపై..
జాతిపతి, రాజ్యాంగ నిర్మాతల ధర్మ సందేహాలు
ఇదంతా ప్రజాసేవకేనా !


