ఎస్సారెస్పీ కెనాల్‌లో ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సట్టు మహేశ్(30) శుక్రవారం ఆటోతో సహా ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి మృతిచెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని నారాయణపూర్–కొదురుపాక గ్రామాల మధ్యలో సమ్మక్క–సారలమ్మ జాతర వద్ద ప్రయాణికులను దించి కొదురుపాకకు వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ఆటో ఎస్సారెస్పీ ఉప కెనాల్‌లో బోల్తాపడింది. మహేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీ క్యాబిన్‌లో ఇరుక్కొని డ్రైవర్..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్‌రహదారిపై శుక్రవారం వేకువజామున టిప్పర్, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్ జనగామ నరేశ్(28) మృతిచెందాడు. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ నరేశ్ టిప్పర్‌తో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. కాట్నపల్లి శివారులో ముందుగా వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ ఎలాంటి ఇండికేషన్ ఇవ్వకుండా టర్న్ చేయడంతో నరేశ్ టిప్పర్‌తో ఢీకొట్టాడు. ఈప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కొని మృతిచెందాడు. మృతుడి భార్య ప్రీతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఏడాది వయస్సు గల బాబు ఉన్నాడు.
నిప్పు అంటుకుని వృద్ధుడు మృతి
చిగురుమామిడి: మండల కేంద్రానికి చెందిన పొన్నం ఆగయ్య(80) ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మృతిచెందాడు. ఏఎస్సై తిరుపతి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. గురువారం రాత్రి ఆగయ్య ఒక్కడే తన గదిలో నిద్రిస్తున్నాడు. బీడీ తాగే అలవాటు ఉండడంతో.. అగ్గిపుల్లతో బీడీ ముట్టించుకున్నాడు. ఈక్రమంలో అగ్గిపుల్ల తన పక్కలోనే పడి మంటలు చెలరేగాయి. వృద్ధాప్యంతో లేచి పరిగెత్తలేకపోయాడు. మంటలు చెలరేగడంతో గమనించిన కొడుకు సమ్మయ్య చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తీయగా.. అప్పటికే మంటల్లో కాలిపోతుండడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతుని కొడుకు సమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎస్సారెస్పీ కెనాల్‌లో ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి


