స్పందిస్తున్న హృదయాలు | - | Sakshi
Sakshi News home page

స్పందిస్తున్న హృదయాలు

Jan 29 2026 6:31 AM | Updated on Jan 29 2026 6:31 AM

స్పంద

స్పందిస్తున్న హృదయాలు

సాక్షి వరుస కథనాలతో ముందుకొచ్చిన 374 మంది దాతలు

‘చిన్నారి తల్లి’కి రూ.6.74లక్షల సాయం

‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలు

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు కందుల తిరుపతి–స్రవంతి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిగా మారిన వారి కూతురు శివాణి దీనగాథపై ‘మమ్మీ..డాడీ..ఒంటరి చేశారు’, ‘కదిలించిన సాక్షి కథనం’, ‘దశదిన కర్మ రోజే కూతురు జన్మదినం’ శీర్షికలతో ప్రచురితమైన వరుస కథనాలు స్థానిక దాతలతోపాటు ఎన్‌ఆర్‌ఐలను కదలిస్తున్నాయి. తొలుత ‘చిన్నారి తల్లి’ పేరిట వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయగా 988 మంది సభ్యులుగా చేరారు. మంగళవారం వరకు 374 మంది దాతలు రూ.6.74 లక్షలు సాయం చేశారు. అంబటి సంతోష్‌రావు రూ.50వేలు, మండల పెరుక సంఘం రూ.35వేలు, విసంపేట పెరుక సంఘం రూ.70,200, శ్రీభగవతి యూత్‌ టీం, కందుల సంధ్యారాణి–పోశం, కందుల సత్యం (దీక్షిత హాస్పిటల్‌, జమ్మికుంట), తోట చిన్నయ్య, కోడూరి విజయ్‌ (శ్రీరాంపూర్‌), ఇత్తినేని రాము (మల్యాలపల్లి) రూ.పది వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. సాక్షి వరుస కథనాలతో వందలాది మంది దాతలు స్పందిస్తూ బాలికకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ‘సాక్షి’ యజమాన్యానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

స్పందిస్తున్న హృదయాలు 1
1/2

స్పందిస్తున్న హృదయాలు

స్పందిస్తున్న హృదయాలు 2
2/2

స్పందిస్తున్న హృదయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement