బస్సు ఆగదు.. చదువు సాగదు! | - | Sakshi
Sakshi News home page

బస్సు ఆగదు.. చదువు సాగదు!

Jan 23 2026 6:39 AM | Updated on Jan 23 2026 6:39 AM

బస్సు

బస్సు ఆగదు.. చదువు సాగదు!

విద్యార్థులకు ఆర్టీసీ బస్సు కష్టాలు

చాలా ప్రాంతాల్లో సమయపాలన కరువు

స్టాపుల వద్ద ఆపని డ్రైవర్లు.. తప్పని పడిగాపులు

ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్న విద్యార్థులు

తిమ్మాపూర్‌: లిఫ్ట్‌ అడుగుతున్న విద్యార్థి

తిమ్మాపూర్‌: బస్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు

తిమ్మాపూర్‌: ప్రమాదకరంగా ప్రయాణం

పొద్దున్నే నిద్రలేచి.. రెడీ అయ్యి.. పాఠశాలకని బయల్దేరిన విద్యార్థులకు బస్టాపుల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కళ్లు కాయలు కాచేలా చూడగా.. కనుచూపు మేర కనిపించే బస్సు పాఠశాలకు వెళ్తున్నామని ఆశలు రేకెత్తిస్తుండగా.. దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్‌ గేరుమార్చి మరింత స్పీడు పెంచి ముందుకెళ్లడం నిరాశకు గురిచేస్తోంది. అప్పటికే పాఠశాల సమయం గడిచిపోగా.. మిగిలిన పాఠాలైనా విందామని అక్కడే ఎదురుచూస్తూ ఉంటే వచ్చిన మరో బస్సులో కిక్కిరిసిన జనం.. సరే అడుగైనా దొరికిందని సంతోషిస్తే... ఫుట్‌బోర్డుపై ప్రమాదకర ప్రయాణం ప్రాణలమీదకు తెస్తోంది. మిగిలిన పాఠాలు విని సాయంత్రం ఇంటికెళ్దామంటే మళ్లీ అదే పరిస్థితి. తరగతులు 9 గంటలకు ప్రారంభమై.. 4 గంటలకు పూర్తవుతున్నా.. విద్యార్థులు ఉదయం 7 గంటలకు ఇంట్లోంచి వెళ్తే.. తిరిగి వచ్చేసరికి రాత్రి 7 అవుతోంది. దీనికి కారణం ఆర్టీసీ బస్సులు రావు.. వచ్చినా ఆపవు.. ఆపినా.. అడుగుకూడా పెట్టలేని పరిస్థితి ఉంటోందని విద్యార్థులు చెబుతుండగా.. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి, రూ.వేలల్లో జేబులు గుళ్ల చేసుకోవడం తల్లిదండ్రుల వంతవుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పాఠశాలు, కళాశాలల విద్యార్థుల ప్రయాణ కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..!!

తిమ్మాపూర్‌: బస్సు కోసం చేయి ఎత్తుతున్న విద్యార్థినులు

బస్సు ఆగదు.. చదువు సాగదు!1
1/4

బస్సు ఆగదు.. చదువు సాగదు!

బస్సు ఆగదు.. చదువు సాగదు!2
2/4

బస్సు ఆగదు.. చదువు సాగదు!

బస్సు ఆగదు.. చదువు సాగదు!3
3/4

బస్సు ఆగదు.. చదువు సాగదు!

బస్సు ఆగదు.. చదువు సాగదు!4
4/4

బస్సు ఆగదు.. చదువు సాగదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement