హుజూరాబాద్‌ జిల్లా సాధనకు నిరాహార దీక్ష | - | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌ జిల్లా సాధనకు నిరాహార దీక్ష

Jan 18 2026 7:05 AM | Updated on Jan 18 2026 7:05 AM

హుజూరాబాద్‌ జిల్లా   సాధనకు నిరాహార దీక్ష

హుజూరాబాద్‌ జిల్లా సాధనకు నిరాహార దీక్ష

హుజూరాబాద్‌ జిల్లా సాధనకు నిరాహార దీక్ష

హుజూరాబాద్‌: జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ కేంద్రంగా జిల్లా సాధనకు 2011 నుంచి పోరాటాలు చేస్తున్నామన్నారు. హుజూరాబాద్‌ జిల్లాను వీపీ పేరుతో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశామ ని గుర్తు చేశారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శాసనసభలో జిల్లాలను శాసీ్త్రయంగా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ప్రకటించారని, ప్రజల ఆకాంక్షకు మేరకు హుజూరా బాద్‌ను జిల్లాగా ప్రకటించాలన్నారు. హుజూ రాబాద్‌ను జిల్లా చేస్తామని జమ్మికుంట ఎన్ని కల బహిరంగ సభలో అప్పటి పీసీసీ అధ్యక్షు డు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. జిల్లా ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు, ఈ ప్రాంత మేధావులు, నిరుద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వ్యాపారులు జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షా శిబిరాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ బాబు సందర్శించి, దీక్ష చేస్తున్నవారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. జేఏసీ కన్వీనర్‌ భీమోజు సదానందం, ముక్కెర రాజు, బండ శ్రీనివాస్‌, పొడిశెట్టి వెంకట్రాజం, పి.ఈశ్వర్‌రెడ్డి, వేల్పుల రత్నం పాల్గొన్నారు.

ఇంటివద్దకే మేడారం ప్రసాదం

విద్యానగర్‌(కరీంనగర్‌): మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే సమ్మక్క సారలమ్మలు ఉన్న ఫొటోతోపాటు అమ్మవార్ల పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదాన్ని అందజేయనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఏటీఎం లాజిస్టిక్స్‌ బాధ్యులు వెంకట నారాయణ, ఆర్‌ఎం ఎ.రాజు శనివారం తెలిపారు. ఈనెల 31 వరకు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకుంటే, ప్రసాదం ప్యాకెట్‌ ఇంటికి తెచ్చి ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9154298581, 9154298561, 9154298559 నంబర్లల్లో సంప్రదించాలని సూచించారు.

ఆర్టీసీలో అప్రెంటిషిప్‌

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ రీజి యన్‌లోని టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ గ్రాడ్యుయే ట్లు, డిప్లొమా అప్రెంటిషిప్‌కు ఫిబ్రవరి 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ ప్రాంతీయ అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తప్పనిసరిగా https://nats.education. gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు

కరీంనగర్‌ టౌన్‌: కరీంనగర్‌ జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం షెడ్యూల్‌ జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు హాల్‌ టికెట్లను ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 19 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 6వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 7 తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఓసీ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాలని సూచించారు.

ఇసుక తవ్వకాలపై విచారణ

వీణవంక: చల్లూరు మానేరువాగు ఇసుక క్వారీలో తవ్వకాలపై హుజూరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌బాబు, మైనింగ్‌ ఏడీ రాఘవరెడ్డి విచారణ చేపట్టారు. చల్లూరు పరిధిలో క్వారీ మంజూరైతే ఇప్పలపల్లి గ్రామంలో తవ్వకాలు చేపడుతున్నారని, వ్యవసాయ బావులను పూడ్చారని రైతులు ఫిర్యాదు చేశారు. మైనింగ్‌ అధి కారులు విచారణ జరిపిన రెండురోజుల తర్వా త మళ్లీ శనివారం తవ్వకాలు జరిపారని అధికా రుల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై తిరుపతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement