మేయర్‌.. బీసీ జనరల్‌ | - | Sakshi
Sakshi News home page

మేయర్‌.. బీసీ జనరల్‌

Jan 18 2026 7:05 AM | Updated on Jan 18 2026 7:05 AM

మేయర్‌.. బీసీ జనరల్‌

మేయర్‌.. బీసీ జనరల్‌

● 66 డివిజన్ల రిజర్వేషన్‌ ఖరారు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలకసంస్థ మేయర్‌ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. గతంలో జనరల్‌ స్థానంగా ఉన్న మేయర్‌ సీటు ఈ సారి బీసీల పరమైంది. శనివారం హైదరాబాద్‌లో తీసిన పది కార్పొరేషన్ల రిజర్వేషన్లలో కరీంనగర్‌ నగరపాలకసంస్థ బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. నగరంలోని 66 డివిజన్లకు ఇటీవల కేటాయించిన సంఖ్య ఆధారంగా కలెక్టర్‌, నగరపాలకసంస్థ ప్రత్యే కాధికారి పమేలా సత్పతి రిజర్వేషన్లు ఖరారు చేశా రు. మహిళా స్థానాలను డ్రా ద్వారా నిర్ణయించారు.

66 డివిజన్‌లకు రిజర్వేషన్‌ ఖరారు

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. మేయర్‌ బీసీ జనరల్‌ కావడంతో ఆశలు పెట్టుకొన్న ఓసీ నాయకులు నిరాశలో మునిగిపోయారు. నగరంలోని 66 డివిజన్లకు రిజర్వేషన్‌ శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ తానాజీవాఖడే, కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఖరారు చేశారు. మహిళలకు డ్రా ద్వారా డివిజన్లను నిర్ణయించారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతం అంటే 33 డివిజన్‌లకు దాటకుండా చర్యలు తీసుకొన్నారు. మహిళలకు 33 డివిజన్‌లు కేటాయించారు. రిజర్వేషన్‌ల ప్రక్రియ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ఆశావాహుల సందడి నెలకొంది.

ఆశలు గల్లంతు

రిజర్వేషన్ల ఖరారుతో చాలా మంది ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యంగా మేయర్‌ బీసీ జనరల్‌ కావడంతో ఆ పదవిని ఆశిస్తున్న నేతల్లో సంబరం నెలకొంది. ఆ తరువాత ప్రకటించిన డివిజన్‌ల రిజర్వేషన్‌తో ఒక్కసారిగా సంబరం నీరుకారిపోయింది. ఆశావాహుల డివిజన్‌లు, ప్రక్క డివిజన్‌లు మహిళలకు రిజర్వ్‌ కావడంతో అంతగా పట్టులేని డివిజన్‌లకు వెళ్లడంపై తర్జనభర్జనపడుతున్నారు. మేయర్‌ బీసీ జనరల్‌ కావడంతో బీసీ మహిళలకు కూడా అవకాశం ఉంటుందంటూ, తమ భార్యలను పోటీలోకి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మాజీ కార్పొరేటర్లలో ఓసీలను బీసీ రిజర్వేషన్‌లు, బీసీలను ఎస్సీ రిజర్వేషన్‌లు దెబ్బతీశాయి. రిజర్వేషన్‌ల ఖరారుతో ఆయా డివిజన్‌లలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.

జనరల్‌(15): 02,06,08,16,18,21,22,23,24,26,42,50,51,65,66

జనరల్‌ మహిళ(18): 03,07,09,11,12,13,15,19, 38,40,41,44,49,52,55,56,57,60

బీసీ జనరల్‌ (13): 10,14,31,32,34,36,37,39,46,58,59,61,63

బీసీ మహిళ (12): 01,05,17,33,35,43,45,47,48,54,62,64

ఎస్సీ జనరల్‌ (04): 04,20,25,29

ఎస్సీ మహిళ (03): 27, 30,53

ఎస్టీ జనరల్‌ (1): 28

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement