చిన్న వయసు.. పెద్ద బాధ్యత
రాయికల్/పాలకుర్తి: చిన్న వయస్సులోనే పలువురు మహిళలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన బండారి మానస 21 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లానాయక్‌తండాకు చెందిన ఇస్లావత్ అఖిల 22 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికవడం విశేషం. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అఖిల తన సమీప అభ్యర్థి బదావత్ లక్ష్మిపై విజయం సాధించారు. స్థానిక కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన అఖిల ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. చిన్నవయస్సులోనే సర్పంచ్‌గా ఎన్నికై న వీరిని స్థానికులు అభినందిస్తున్నారు. అలాగే రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కొడిపల్లి రాజవ్వ సర్పంచ్‌గా గెలుపొందారు. రాయికల్ మండలంలో మానస, రాజవ్వ అత్యల్ప, అత్యధిక వయస్సు గల సర్పంచులు.
మానస,
ఒడ్డెలింగాపూర్
రాజవ్వ,
బోర్నపల్లి
ఇస్లావత్ అఖిల, బామ్లానాయక్‌తండా
ఇరవై ఏళ్లుగా ఆ దంపతులే..
రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో 20 ఏళ్లుగా ఆ దంపతులే సర్పంచ్, ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన బెజ్జంకి మోహన్ 2006–11 వరకు సర్పంచ్, 2014–19 వరకు ఎంపీటీసీగా గెలిచారు. 2019–24 వరకు ఆయన భార్య రమాదేవి సర్పంచ్‌గా సేవలందించగా, ప్రస్తుతం మోహన్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
అక్క సర్పంచ్..
తమ్ముడు ఉపసర్పంచ్
జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినవారు విజయం సాధించడంతో పాటు, రెండు పదవులను కై వసం చేసుకోవడం వారిలో ఆనందం నింపింది. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామ సర్పంచ్‌గా రెడ్డిరత్న గెలుపొందగా, ఆమె సోదరుడు గుంటి రవి వార్డుమెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
సర్పంచ్‌గా గెలిచి.. హామీ నెరవేర్చి
ఇల్లంతకుంట(మానకొండూర్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఓ సర్పంచ్. గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చారు. వివరాలు.. ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ తనను సర్పంచ్‌గా గెలిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. విజయం సాధించగానే నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కోతులను పట్టెవారిని రప్పించారు. సోమవారం 113 కోతులను బోనులో బంధించి అడవికి తరలించారు. ఒక కోతిని పట్టుకుంటే రూ.500 చొప్పున చెల్లిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో చాలా కోతులు ఉన్నాయని వాటన్నింటినీ తరలిస్తామని పేర్కొన్నారు.
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
చిన్న వయసు.. పెద్ద బాధ్యత


