షార్ట్ సర్క్యూట్‌తో రూ.2.50 లక్షల ఆస్తినష్టం
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక మల్లికార్జున్‌నగర్‌లో చిరువ్యాపారి పి.రాజేశ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం రాజేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, ఫ్రిడ్జ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కలవారు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.2.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ పి.లక్ష్మీనారాయణ తెలిపారు. సిబ్బంది ఎ.రమేశ్, ఎం.బానయ్య, పి.మనోహర్, ఇ.చందు పాల్గొన్నారు.


