మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్‌కు స్పందన
కొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అమోట్–2025కు అనూహ్య స్పందన లభించింది. ఆదివారం కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ (అమోట్)–2025ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించిన టెస్ట్‌కు 18,450 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఎన్‌ఆర్ మాట్లాడుతూ, అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆరంభం నుంచి శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ రూ.3 వేలు, తృతీయ రూ.2 వేలు ఈ నెల 22న రామానుజన్ జయంతి సందర్భంగా అందజేస్తామని తెలిపారు.


