మా ఓటు అమ్మబడదు
● మామిడాలపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు
వీణవంక: ‘మా ఓటు మద్యానికి, డబ్బుకు అమ్మబడదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కల్పించిన ఓటుహక్కును వినియోగించుకుందాం. మన గ్రామ అభివృద్ధికి ఓటు వేద్దాం’ అని మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో యువకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులు మద్యం, డబ్బు పంపిణీ చేయొద్దని, పంపిణీ చేసినా ఓటర్లు తీసుకోవద్దని, యువకులు, విద్యావంతులు అలోచన చేియాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని పేర్కొన్నారు.


