తుప్పు.. తుక్కు!
గాడి తప్పితే వేటే
మా పేర్లు ఎక్కడున్నాయ్: మానకొండూర్‌లో ఓటర్ లిస్టులో
పేర్లు సరిచూసుకుంటున్న ఓటర్లు
యువతరంగం: మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామంలో తొలిసారి ఓటేసిన యువతులు
బ్యాలెట్ భద్రం: తిమ్మాపూర్‌లో ఓటింగ్ ముగియడంతో
బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేస్తున్న ఎన్నికల సిబ్బంది
పిల్లలతో వచ్చాం: కేశవపట్నంలో చంటి బిడ్డలతో
ఓటేసేందుకు వచ్చిన మహిళలు
కరీంనగర్ కార్పొరేషన్:
నగరంలోని ఓపెన్‌జిమ్‌ల నిర్వహణ ఎవరికీ పట్ట డం లేదు. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరవ్యాప్తంగా పార్క్‌లు, ఓపెన్‌ప్లేస్‌లు, వాకింగ్ ట్రాక్‌ల వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో పరికరాలు అధ్వానంగా మారుతున్నాయి. చెడిపోయి.. తుప్పు పట్టిన పరికరాలకు మరమ్మతులు చేసే నాథుడు కరువవడంతో నగరవాసులు వ్యాయామానికి విరామం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
30 ఓపెన్ జిమ్‌లు
నగరప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 30 ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిమ్ రూ.12 లక్షల చొప్పున, సుమారు రూ.3.60 కోట్ల వ్యయంతో నెలకొల్పారు. నగరంలోని వివిధ కాలనీలు, పార్క్‌లు, బహిరంగ ప్రదేశాలు, వాకింగ్ ట్రాక్‌లు, స్టేడియం, మైదానాల్లో ఈ ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు.
వ్యాయామానికి విరామం
రూ.లక్షల ఖర్చుతో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయడంలో చూపిన శ్రద్ధ అధికారులు వాటి నిర్వహణలో చూపడం లేదనే విమర్శలున్నాయి. జిమ్‌ల నిర్వహణ బాధ్యతను అధికారులు గాలికి వదిలేయడంతో పరికరాలు దెబ్బతింటున్నాయి. ఆరోగ్యపరంగా వ్యాయామం అవసరం, అందులో శీతాకాలం కావడంతో ప్రస్తుతం ఓపెన్‌జిమ్‌లకు ఆదరణ ఎక్కువగానే ఉంది. ఆయా కాలనీల కు చెందిన మహిళలు, యువత ఎక్కువగా ఓపెన్‌జిమ్‌లపై ఆధారపడుతున్నారు. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వ్యాయామానికి విరామం ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని చోట్ల వాడకం ఎక్కువై, మరికొన్ని చోట్ల నాసిరకం పరికరాలు, చాలా చోట్ల పోకిరీల కారణంగా ఓపెన్ జిమ్‌ల్లోని పరికరాలు దె బ్బతింటున్నాయి. పరికరాలను ఎప్పటికప్పుడు మ రమ్మతులు చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా నగరపాలకసంస్థ అధికారులు ఓపెన్‌జిమ్‌ల నిర్వహణపై దృష్టి సారించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదుకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన డీఎస్‌ఈ, ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌పై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎఫ్‌ఆర్‌ఎఫ్ విధానంతో ఇప్పటికే ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం 85శాతం నుంచి 90శాతానికి పెరిగింది. ఎఫ్‌ఆర్‌ఎస్‌పై నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది. ఇటీవల జరిగిన ఎంఈవోల సమావేశంలో హాజరుశాతం తక్కువగా ఉన్న పాఠశాలల హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. స్కూళ్లకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో ఇన్‌టైమ్, అవుట్ టైమ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. సెలవు కోసం యాప్‌లో దరఖాస్తు చేసుకుని, హెచ్‌ఎంలతో అనుమతి పొందిన తర్వాతే అది సాధారణ సెలవుగా పరిగణించబడుతుంది. ట్రైనింగ్, ఇతరత్రా కార్యాలయ పనులకు వెళితే ఓడీ వెళ్లిన చోట నుంచి పాఠశాల ముగింపు సమయంలోపే అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ యాప్‌పై గుర్రుగా ఉన్నాయి.
విద్యాశాఖ అధికారుల దృష్టి..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం, విధులకు అనధికారికంగా హాజరు కాకపోవడం, పారిశుధ్యం లోపించడం.. తదితరాల అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్న, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న, నిధులను దుర్వినియోగం చేస్తున్నవారిపై గ్రామస్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు వేటు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులతో అమర్యాదగా ప్రవర్తించడం, మద్యం సేవించి పాఠశాలకు రావడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం, ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా వాట్సాప్‌లో సందేశాలు పంపించడం వంటి ఘటనలతో కరీంనగర్ రూరల్, శంకరపట్నం, హుజూరాబాద్ ప్రాంత పాఠశాలల్లో రెండు నెలల వ్యవధిలో 9మంది ఉపాధ్యాయులపై వేటు వేసిన విషయం తెలిసిందే.
మానేరు వద్ద
పాడైపోయిన జిమ్ పరికరం
కిసాన్‌నగర్‌లో
పాడైపోయిన పరికరం
ఓపెన్ జిమ్‌లు వినియోగంలోకి తేవాలి
నగరపాలకసంస్థ పరిధిలో ఉన్న ఓపెన్ జిమ్‌లు పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. చాలా చోట్ల నిర్వహణ లోపంతో పరికరాలు పనిచేయడం లేదు. దీంతో వ్యాయామానికి వచ్చే వాళ్లు వెనుదిరగాల్సి వస్తోంది. ఓపెన్‌జిమ్‌ల నిర్వహణ నగరపాలకసంస్థదా, సంబంధిత కాంట్రాక్టర్లదా తెలియడం లేదు. కమీషన్ల కోసమే ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేసినట్లుంది. నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓపెన్‌జిమ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
– అనంతుల రమేశ్, కాంగ్రెస్ నాయకుడు, కిసాన్‌నగర్, కరీంనగర్
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!
తుప్పు.. తుక్కు!


