యువత రాజకీయాల్లోకి రావాలి
కరీంనగర్/కరీంనగర్‌టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల నుంచి నిర్వహించిన ఐక్యతా మార్చ్‌లో సంజయ్ పాల్గొన్నారు. దేశ ఐక్యత కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహనీయుడు వల్లభాయిపటేల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ‘సర్దార్ ఎట్ 150 ఐక్యతా మార్చ్’ నిర్వహిస్తోందన్నారు. సౌదీ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. విదేశాంగశాఖ అధికారులతో, హోంమంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. 8002440003 (టోల్‌ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301 నంబర్లతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి జిల్లాలో చేపట్టిన స్టూడెంట్స్ క్లబ్బుల ఏర్పాటు విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని వెల్లడించారు. సోమవారం కళాభారతిలో ప్రభుత్వ పాఠశాల్లో చదివే 2,566 మంది విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. 578 పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ప్రతి ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తానని, 10వ తరగతి పరీక్ష ఫీజు తానే చెల్లిస్తానని వెల్లడించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రతి క్లబ్ విద్యార్థికి ప్రత్యేక బాధ్యత ఉందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వినూత్నంగా చేపట్టిన 5 క్లబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సీపీ గౌస్ ఆలం, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో మొండయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, కృపారాణి పాల్గొన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి


