మహిళా బ్లూకోల్ట్స్‌కు ‘షీ లీడ్స్’ శిక్షణ
కరీంనగర్ క్రైం: పోలీసుశాఖలో మహిళా బ్లూ కోల్ట్స్ సిబ్బంది కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. కమిషనరేట్ కేంద్రంలో మహిళా పోలీసులకు మూడు రోజులపాటు నిర్వహించే ‘షీ–లీడ్స్’ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. మహిళా పోలీసులను ‘విజిబుల్ పోలీసింగ్’లో భాగస్వామ్యం చేయడానికి ‘బ్లూ కోల్ట్స’ విధులు కేటాయించామన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సంఘటనలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మహిళా పోలీసులను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. దాదాపు 100మందికి రెండు దశల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ధర్నాలు, నిరసనల్లో మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్ జి, వేణుగోపాల్, మాధవి కరాటే మాస్టర్ వసంత్ కుమార్ పాల్గొన్నారు.
1,280 కేసులు పరిష్కారం
కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం అయినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ కేసులు 257, ఈపెట్టి కేసులు 23, డ్రంకెన్‌డ్రైవ్, మోటార్ వెహికల్ చట్టం కేసులు 1,008, సైబర్ కేసులు 57 ప రిష్కారం అయ్యాయని, సైబర్ కేసుల్లో రూ.51.39 లక్షల రీఫండ్‌కు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.


