కరీంనగర్ కార్పొరేషన్: నగర అభివృద్ధికి సుడా నిధులు కేటాయిస్తున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కట్టరాంపూర్ కార్తికేయనగర్‌కాలనీలో సుడా నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్తికేయనగర్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు సుడా నిధులు రూ.10 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్తికేయ నగర్ నుంచి అపూర్వ ఎన్‌క్లేవ్ మీదుగా కట్టరాంపూర్ మెయిన్ రోడ్డు వరకు డ్రైనేజీ, రోడ్డు నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చా రు. మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్స య్య, నెల్లి నరేశ్, దన్న సింగ్, బత్తిని చంద్ర య్య, గంగుల దిలీప్, విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్‌కల్చరల్: వ్యక్తిత్వ వికాసంతో ఎదిగిన యువత వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తూ, సంస్థకు మంచి పేరు తెస్తున్నారని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షకుడు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం ‘వ్యక్తిత్వ వికాసం’ అంశంపై మాట్లాడుతూ.. శారీరక, మానసిక, భావోద్వేగ, ప్రవర్తనా పరమైన అంశాల్లో సమతుల్యత కలిగి ఉండడానికి తగిన వ్యక్తిత్వ వికాసం అవసరం అన్నారు. ఎం.ఆర్.వీ. ప్రసాద్ తెలుగు పండిట్ కొన్ని విలువైన ఇతిహాస పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు. గ్రంథాలయ కార్యదర్శి సరిత, డిప్యూటీ లైబ్రేరియన్ అర్జున్ పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యానని జిల్లా భవన నిర్మాణకార్మిక సంఘల జేఏసీ నాయకులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాల న్నారు. మీసేవ కేంద్రాల్లో అధిక డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పిట్టల సమ్మయ్య, ఆకుల మల్లేశ్, బొంకూరి రాములు, ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు
కరీంనగర్: జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌వో వెంకటరమణ సోమవారం తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రుల్లో స్కానింగ్ యంత్రాలను పరీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీవో డీటీటీ ఉమాశ్రీ, పీవో ఎంహెచ్‌ఎన్ సనజవేరియా, సయ్యద్ సాబీర్, ఇజాస్ పాల్గొన్నారు.
జల వనరుల గణన పక్కాగా చేయండి
కరీంనగర్ అర్బన్: జల వనరుల గణన పక్కాగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. సోమవారం సంబంఽధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. కేంద్ర ఆదేశాల క్రమంలో ప్రతి అయిదేళ్లకోసారి నీటి వనరుల గణన జరుగుతుందన్నారు. 1986 నుంచి ఇప్పటికి ఆరుసార్లు జరిగిందని తెలిపారు. తహసీల్దార్లు మండల ఛార్జి ఆఫీసర్లుగా వ్యవహరించాలని, సర్వేలో జీపీవోలు, ఏఈవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు ఎన్యుమరేటర్లుగా వ్యవహరించాలన్నారు. ఉప గణాంక అధి కారులు, సహాయ గణాంక అధికారులు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీధర్ పాల్గొన్నారు.
నగరాభివృద్ధికి సుడా నిధులు
నగరాభివృద్ధికి సుడా నిధులు
నగరాభివృద్ధికి సుడా నిధులు


