హెచ్‌బీ ఉండాలి.. మంచి ఆహారం తినాలి
హెచ్‌బీ(హిమోగ్లోబిన్) గర్భిణుల్లో 12శాతం ఉండాలి. లేదంటే వారు అనారోగ్యాల బారిన పడే అవకాశముంది. తొమ్మిది కన్నా తక్కువ ఉంటే వైద్యుల సూచన మేరకు ఐరన్ మాత్రలు, ఇంజక్షన్లు వేసుకోవాలి. ఆరు కన్నా తక్కువ ఉంటే తప్పకుండా రక్తం ఎక్కించుకోవాలి. నిత్యం బీట్‌రూట్, ఆపిల్, వేరుశనగ, నువ్వుల ఉండలు, బెల్లం, బచ్చలికూర, చిక్కుడుగింజలు, బఠాణీలు, ఎండుద్రాక్ష తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ, గుడ్లు తినడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత నివారణకు ఐరన్, పోలిక్ యాసిడ్ మందులను వాడాలి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నాం. సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి


