బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి
కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్ కో– ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ పాలకమండలి సభ్యులతో శుక్రవారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మార్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నా రు. బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. నూతనంగా ఎన్నికై న అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ మరియు పాలకవర్గ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు.
దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా నిలుపుదాం
కరీంనగర్ అర్బన్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకును దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా నిలుపుదామని నాఫ్క్సాబ్ ఛైర్మన్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. శుక్రవారం నగరంలోని కేడీసీసీబీ ప్రధాన కార్యాలయంలో 72వ సహకార వారోత్సవాలను ప్రారంభించారు. ఐ– ఫోన్ వినియోగదారుల కోసం మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం సహకార జెండాను ఎగురవేశారు. అన్ని బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నందున డిపాజిట్లను మెరుగుపరచాలని అన్నారు. సాధారణ కస్టమర్లకు 8 శాతం వడ్డీ, మహిళలు, సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీని అందించే ‘సౌభాగ్య ఫిక్స్‌డ్ డిపాజిట్’ పథకాన్ని బ్యాంకు ప్రారంభించిందని గుర్తు చేశారు. కేడీసీసీబీ వైస్ ఛైర్మన్ పింగళి రమేష్, డైరెక్టర్ స్వామిరెడ్డి, సీఈవో సత్యనారాయణరావు, జనరల్ మేనేజర్లు శ్రీధర్, రియాజుద్దీన్ పాల్గొన్నారు.
నెహ్రూ ప్రణాళికతోనే దేశాభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రణాళికాబద్ధమైన పాలనతోనే ప్రస్తుతం దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. నెహ్రూజయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో, సవరన్ స్ట్రీట్‌లోని నెహ్రూ విగ్రహ స్థానం వద్ద వేడుకలు ని ర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పులి ఆంజనేయులు గౌడ్, వెన్నం రజిత రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జమాలుద్దీన్, వంగల విద్యాసాగర్, అబ్దుల్ బారి, రాజకుమార్ పాల్గొన్నారు.
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7, 200 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 68 వాహనాల్లో 589 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.6, 800, కనిష్ట ధర రూ. 6,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని,ఆదివారాలు మార్కెట్‌కు సాధరణ సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని, మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న, మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
బీసీసీఐ టీ20 హైదరాబాద్ జట్టులో శ్రీవల్లి
కరీంనగర్‌స్పోర్ట్స్: హైదరాబాద్ మహిళల అండర్– 23 టీ20 క్రికెట్ జట్టుకు కరీంనగర్‌కు చెందిన కట్ట శ్రీవల్లి ఎంపికై ంది. హైదరాబాద్ సీని యర్ మహిళా టీ20 క్రికెట్ జట్టును హెచ్‌సీఏ బాధ్యులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 24నుంచి నాగపూర్‌లో బీసీసీఐ మహిళల అండర్–23 టీ20 క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీవల్లిని పలువురు అభినందించారు.
బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి
బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి
బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి


