లక్ష్యసాధనకు కఠోరంగా శ్రమించాలి
కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌కల్చరల్/చొప్పదండి: విద్యార్థులు లక్ష్యసాధనకు కఠోరంగా శ్రమించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. చదువుపైనే ధ్యాస పెట్టాలని, అనవసర విషయాలు పట్టించుకోవద్దని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. చిన్నారులు బాగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం బాలభవన్, కేజీబీవీ సంక్షేమ ట్రస్ట్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా సంక్షేమ అధికారి సబిత, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి పాల్గొన్నారు.
‘నీల్ బత్తె సన్నాట’ సినిమాను ఆదర్శంగా తీసుకోవాలి
‘నీల్ బత్తె సన్నాట’ అనే హిందీ సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఫిలింభవన్‌లో నిర్వహించిన చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘నీల్ బత్తె సన్నాట’ హిందీ సినిమాను కేజీబీవీతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదర్శిస్తున్నామని దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపా రు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, అడ్వైజర్ వరాల మహేశ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీగౌతమ్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ముజఫర్, అన్నవరం దేవేందర్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. డెలివరీ, వార్డు రూములు, మందులు ఇచ్చే గదులు పరిశీలించారు. ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యాధికారి శ్రీకీర్తనకు సూచించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, డాక్టర్ రాజగోపాల్, ప్రోగ్రాం అధికారి సనా, ఎంపీడీవో వేణుగోపాల్ రావు, తహసీల్దార్ నవీన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.
లక్ష్యసాధనకు కఠోరంగా శ్రమించాలి


