గురునానక్ జయంతి
కరీంనగర్‌కల్చరల్: జిల్లా కేంద్రంలోని గురుద్వారాలో బుధవారం పౌర్ణమి పురస్కరించుకొని గురునానక్ దేవ్‌జీ మహారాజ్ 556వ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కొన్ని రోజులుగా గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో గురువాణి, ప్రత్యేక కీర్తనలు, నగ ర వీధులగుండా ప్రభాతభేరి నిర్వహించారు. జయంతి సందర్భంగా సిక్కు మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు ఆలపించారు. లూథియానా నుంచి కర్లోచన్‌సింగ్ హాజరయ్యారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాద వితరణ జరిగింది. ప్రబంద్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.


