ట్రాక్టర్ సేవలు.. ఉపాధికి బాటలు
బోయినపల్లి(చొప్పదండి): ట్రాక్టర్.. రైతు జీవన విధానంలో ఓ భాగమైంది. ట్రాక్టర్లు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయరంగం కొత్త పుంతలు తొక్కింది. ఫ్రంట్‌బ్లేడ్, వరికోత మిషన్లు, ట్రాక్టర్లతో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో ఏటా నవంబర్ 6న ట్రాక్టర్ యజమానుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు.
ట్రాక్టర్‌తో వ్యవసాయం కొత్త పుంతలు
ట్రాక్టర్లు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంది. కేజీవీల్స్, కల్టివేటర్ సాయంతో పొలందున్నుకుంటున్నారు. పత్తి, మొక్కజొన్న, పెసర వంటి పంటల సాగులోనూ వినియోగిస్తున్నారు. పత్తి, వరి చేలలో క్రిమిసంహారక మందులు కూడా పిచికారీ చేస్తున్నారు. హార్వెస్టర్లు అందుబాటులో కొచ్చాక వరికోతలు గంటల్లో ముగుస్తున్నాయి. ఫ్రంట్‌బ్లేడ్ అందుబాటులోకొచ్చాక భూముల చదును రోజుల్లోనే కానిస్తున్నారు. ఇసుక, కంకర, మొరం, ఇటుక రవాణా మొదలు చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ట్రాక్టర్ వినియోగం పెరిగింది.
ప్రతి పనిలోనూ వినియోగం
జిల్లాలో 13 వేల వరకు అన్నిరకాల ట్రాక్టర్లు
నేడు ట్రాక్టర్ యజమానుల దినోత్సవం


