న్యూస్‌రీల్
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మోంథా పోత!
ఇతని పేరు శ్రీనివాస్. ఆరెపల్లి విలీన గ్రామం. మూడున్నర ఎకరాల్లో వరి వేయగా కోసిన పంటను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కు తరలించాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో రోజూ ధాన్యం ఆరబెట్టడం.. కొనుగోళ్ల కోసం నిరీక్షించడం నిత్యకృత్యమైంది. రెండ్రోజులుగా వర్షం కురుస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు శ్రీనివాస్, అతని భార్య పడరాని పాట్లు పడుతున్నారు.
కరీంనగర్ అర్బన్/ కరీంనగర్ కార్పొరేషన్/ హుజూరాబాద్: ‘మోంథా’ తుపాన్ జిల్లాను వణికిస్తోంది. బుధవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుండగా రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. హుజూ రాబాద్, కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పలు కాలనీలు నీటిలో చిక్కుకోగా.. దంచికొట్టిన వాన రైతులకు తీరని నష్టాన్ని మిగి ల్చింది. ధాన్యాన్ని కుప్పపోసుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వర్షంతో పాటు ఈదురుగాలులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 5వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోగా కోతకొచ్చిన వరి నేలవాలింది. జిల్లావ్యాప్తంగా కోతలు మొదలవగా 20 శాతం పంట కోశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. గురువారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.
హుజూరాబాద్ జలమయం
జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి వరకు రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్ మండలంలో అత్యధికంగా 24.02 సెంటీమీటర్ల వర్షం కురియగా.. పట్టణంలో ఎటు చూసినా వరద నీరే పారింది. మామిళ్లవాడ, కాకతీయకాలనీ, బుడిగజంగాల కాలనీ, విద్యానగర్ జలమయం అయ్యాయి. దీంతో పాఠశాలలకు మధ్యాహ్నమే సెలవు ప్రకటించారు. ఇళ్లకు చేరేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్‌రోడ్డు నుంచి హెచ్‌పీ పెట్రోల్ పంపు వరకు పెద్దఎత్తున నీరు చేరడంతో చెరువును తలపించింది. చిలుక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వడ్డెరకాలనీతో పాటు కనుకులగిద్ద– హుజూరాబాద్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్‌లో 19.02, చిగురుమామిడిలో 23.08, కరీంనగర్‌లో 16.01, గన్నేరవరంలో 9.07, ఇల్లందకుంటలో 9.03, వీణవంకలో 9.08, మానకొండూర్‌లో 12.08, కొత్తపల్లిలో 8.05, జమ్మికుంటలో 8.09, రామడుగులో 12.01, కరీంనగర్ రూరల్‌లో 7.06, చొప్పదండి 5.01, తిమ్మాపూర్‌లో 12.03, గంగాధరలో 7.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నగరంలో భారీ వర్షం
భారీ వర్షానికి కరీంనగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హౌసింగ్ బోర్డుకాలనీ, మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, భగత్నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు కాల్వ లను తలపించాయి. చాలా ఇండ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని వీపార్క్, రాంనగర్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పర్యటించారు. తుపాన్ ప్రభావంతో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారుల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిజాస్టర్ సిబ్బంది షిఫ్టుల వారిగా విధులు నిర్వహించాలన్నారు. రాంనగర్‌లోని సమస్యకు త్వరగా శాశ్వత పరిష్కారం చూపేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
సైదాపూర్‌లో వరదలో చిక్కిన ఆర్టీసీబస్సు హుజూరాబాద్‌లో ఇళ్లమధ్య వరదనీరు
సిటీలో పరిస్థితిని పరిశీలిస్తున్న కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హౌసింగ్ బోర్డుకాలనీలో ఇళ్లలోకి చేరిన నీరు, జలమయమైన నగరంలోని మంచిర్యాల చౌరస్తా
ఎల్‌ఎండీ 10 గేట్లు ఎత్తివేత
తిమ్మాపూర్: ఎల్‌ఎండీ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ఉదయం 12 గంటల తర్వాత 2 గేట్లు ఎత్తారు. రాత్రి వరకు ఇన్‌ఫ్లో పెరగడంతో 30వేల క్యూసెక్కుల నీటిని 10గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.
అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ పమేలా సత్పతి
మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. అత్యవసమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఎలాంటి సమస్యలున్నా కంట్రోల్ రూం నంబర్ 0878–2997247కు ఫోన్ చేయాలని తెలిపారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
కరీంనగర్‌రూరల్/సప్తగిరికాలనీ: భారీ వర్షాలతో కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరిగే అన్ని తరగతుల ఎస్‌ఏ–1 పరీక్షలను వచ్చేనెల 1న నిర్వహించాలని, 31న జరిగే పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని సూచించారు.
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన
దంచికొట్టిన వాన


