ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట
కరీంనగర్‌టౌన్: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయాలని బుధవారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. తెలంగాణ చౌక్ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అట్టుకున్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖను సీఎం దగ్గరే పెట్టుకుని, నియంత పాలన సాగిస్తున్నారన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం పోలీసులు బీఆర్‌ఎస్వీ నాయకులను పీటీసీకి తరలించారు. జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ మధుసూదన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, బండారపు అజయ్ కుమార్‌గౌడ్, శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి చుక్కా శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, ఆరె రవిగౌడ్, గంగాధర చందు, నారదాసు వసంత్ పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: రూ.8500 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలోని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి, గ్యారంటీల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ, వృత్తి విద్య కళాశాలలు రెండుసార్లు మూసివేసిన దుస్థితికి ఏర్పడిందన్నారు. అనంతరం కార్యాలయం వద్ద పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరుగగా, అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేశ్, నందు, విగ్నేశ్, వంశీ, విష్ణు, ప్రదీప్, అజయ్, సాయి, నిఖిల్, విగ్నేష్, ప్రశాంత్, ఆకాష్, మురళి, రాజేష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట


