విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
హుజూరాబాద్‌రూరల్/జమ్మికుంట: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సూచించారు. ఇటీవల గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న మండలంలోని రాంపూర్‌కు చెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. శ్రీ వర్షిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ మండలా ధ్యక్షుడు రాముల కొమురయ్య, పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, మోడెపు వినయ్, కొండాల్‌రెడ్డి, రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, చైతన్యరెడ్డి పాల్గొన్నారు.
వైద్యులను నియమించాలి
జమ్మికుంట ఆస్పత్రిలో వైద్యలను నియమించాలని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ సీఎస్‌అర్ నిధులతో ఆసుపత్రికి రూ.1.50 కోట్లతో 15 రకాల వైద్య పరికరాలు అందించారన్నారు. డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు పాల్గొన్నారు.


