పోలీసుల రక్తదాన శిబిరం
కరీంనగర్‌క్రైం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం కమిషనరేట్లో సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానంతో అత్యవసర పరిస్థితుల్లో రోగిప్రాణాలు కాపాడవచ్చన్నారు. తలసేమియా బాధితులకు రక్తం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 160 యూనిట్లను సేకరించి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్‌కు అందించామన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి పాల్గొన్నారు.
రన్ ఫర్ యూనిటీ విజయవంతం చేయండి
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 31న కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ పరుగు ఉదయం 6 గంటలకు 5 కిలోమీటర్లు పొడవు సాగుతుందని తెలిపారు. యువత అత్యధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


