పురాతన నాణేలు స్వాధీనం
జూలపల్లి: పురాతనకాలం నాటి నాణేలు, వస్తువులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని, ఎవ్వరికై నా దొరికితే వెంటనే సంబంధిత అధికారులకు, లేదా పోలీసులకు స్వాధీనం చేయాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. మండలంలోని తెలుకుంట ఆబాది చీమలపేటలో తొంటి రాజుకు చెందిన ఇళ్లస్థలాన్ని చదును చేసే క్రమంలో లభించిన పురాతన వెండి నాణేలు పదింటిని స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ సనత్‌కుమార్ ఉన్నతాధికారులకు అప్పగించారు. ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ.. చీమలపేటలో లభించిన నాణేల్లో వెండి రాగి, ఇత్తడి మిశ్రమాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వివరించారు. ఒక్కోనాణేం తులం బరువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరికై న పురాతన వస్తువులు లభిస్తే వెంటనే రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


