తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ తీగలు
ముస్తాబాద్ (సిరిసిల్ల): ఒక్కసారిగా ఇంటిపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడగా.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాధితుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ల రేణుక, మౌనిక ఇళ్లపై నుంచి 11 కేవీ విద్యుత్ లైన్ ఉంది. మంగళవారం విద్యుత్ వైర్లు తెగి ఇళ్లపై పడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న రేణుక, మౌనిక బయటకు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. తీగలు తెగి పడగానే కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఇంటిపై కరెంట్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను ఇంటిపై నుంచి తొలగించాలని యజమానులు కోరారు.
తప్పిన పెను ప్రమాదం


