● సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: నిందితులను పట్టుకోవడంలో సీసీఎస్ పోలీసుస్టేషన్ సేవలు కీలకమని సీపీ గౌస్ ఆలం అన్నారు. సోమవారం కరీంనగర్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. గతంలో టూటౌన్ పోలీసు స్టేషన్ భవనంలో పై అంతస్తులో ఉన్న సీసీఎస్ స్టేషన్‌ను రూరల్ ఏసీపీ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవనంలోకి తరలించారు. డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయ్‌కుమార్, యాదగిరిస్వామి, వేణుగోపాల్, సీసీఎస్ సీఐ ప్రకాశ్ పాల్గొన్నారు. అలాగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా సీపీ కరీంనగర్‌లోని సీఎస్‌ఐ వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వీసులో మృతిచెందిన పోలీసు కుటుంబాలను ఆదుకునేందుకు నలుగురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. సీపీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా వి.అఖిల, ఎం.అరుణ్‌కుమార్, ఎం.రిషికుమార్, మహమ్మద్ సకీబ్ ఉద్దీన్ నియామకమయ్యారు.
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ అల్గునూర్‌లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న హెచ్‌సీఏ ఏ డివిజన్ వన్డే లీగ్‌లో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీంపై బుడ్డింగ్ స్టార్ విజయం సాధించింది. సోమవారం ఉదయం తొలుత బ్యాటింగ్ చేసిన బుడ్డింగ్ స్టార్ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. జట్టులో జైరామ్ కశ్యప్ 117 బంతుల్లో 121 పరుగులు సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీం 45 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. బుడ్డింగ్ స్టార్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోటీల నిర్వహణలో జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు ఆగంరావు, మురళీధర్‌రావు, మహేందర్ గౌడ్, మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
శాతవాహన స్నాతకోత్సవానికి రండి
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి రావా లని సోమవారం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉ మేశ్‌కుమార్ సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. నవంబర్ 7న రెండో స్నాతకోత్సవం జరగనుందని, ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టర్ జాస్తి రవికుమార్, సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిందితులను పట్టుకోవడంలో సీసీఎస్ కీలకం
నిందితులను పట్టుకోవడంలో సీసీఎస్ కీలకం


