
ఒకే బైక్.. 277 చలాన్లు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లో 277 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఉన్న బైక్‌ను శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక సిక్‌వాడీ వద్ద ట్రాఫిక్ సీఐ రమేశ్ వాహనాల తనిఖీ చేపట్టారు. అక్కడకు యూనికార్న్ టీఎస్02 ఈఎక్స్1395 బైక్ రావడంతో ఆ బైక్‌పై ఉన్న చలాన్ల పరిశీలించారు. 277 పెండింగ్ చలాన్లు ఉండడం గమనించి షాక్‌కు గురయ్యారు. ఇందులో 254 హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో పాటు ట్రిఫుల్‌రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, లైసెన్సు లేకపోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయి. మొత్తం జరిమానా రూ.79,845 కాగా.. 2019 జూన్ నుంచి డిసెంబర్ 2024 వరకు 277 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని సీఐ తెలిపారు. వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ బైక్ గోదాంగడ్డకు చెందిన ఆర్‌ఎంపీ అబ్దుల్ ఖయ్యూమ్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
టీచర్ల సర్దుబాట్లలో మార్పులు
కరీంనగర్: జిల్లావ్యాప్తంగా ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరుగగా, ఆ ఉత్తర్వులలో పలు మార్పులు చేస్తూ డీఈవో శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గతవారంలో జిల్లావ్యాప్తంగా 109 మంది టీచర్లకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయగా జావిద్ అనే ఉపాధ్యాయుడు తనకు అన్యాయం జరిగిందని లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. దీంతో సర్దుబాటు ఉత్తర్వులను సవరించి, తాజాగా 105మంది జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. గతంలో జరిగిన సర్దుబాట్లలో ఉన్నతాధికారుల తీరుపై పలు ఆరోపణలు రాగా, ప్రస్తుతం మళ్లీ ఉత్తర్వులు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. 105 మందిలో గతంలో ఉన్న ఉపాధ్యాయులు కొందరు సర్దుబాటులో వేరే పాఠశాలకు వెళ్లగా, మరికొందరిని అక్కడే ఉంచుతూ ఉత్తర్వులు వెలుబడ్డాయి. తాజా జరిగిన సర్దుబాటు సైతం సరిగా లేదని పలువురు ఉపాధ్యాయులు గుసగుసలాడుతున్నారు.