
సెల్ పాయింట్‌లో అగ్నిప్రమాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా సమీపంలోగల సెల్ పాయింట్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన సెల్‌పాయింట్ యజమాని శ్రావణ్ శనివారం షాపునకు తాళం వేసి వెళ్లాడు. ఉదయం షాపు నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని షాపు యజమాని శ్రావణ్ తెలిపారు. ఘటనలో సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖాధికారి తెలిపారు.
రూ.2లక్షల ఆస్తినష్టం