
మానసిక వేదనే
మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందితే బెనిఫిట్స్ అందకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదు. 20 నెలలుగా రిటైర్డు ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంట్లో పిల్ల పాపలతో హాయిగా ఉండాల్సిన సమయంలో కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం తగదు. మానసిక వేదనకు గురై కొందరు ఆసుపత్రుల పాలు మరికొందరు అకాలమరణం చెందుతున్నారు. బెనిఫిట్స్ సాధనకు ఈనెల 7న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాకు తరలిరావాలి.
– కోహెడ చంద్రమౌళి, రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు(రేవా)