
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి
రిటైర్డు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందజేయాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలి. ఎనిమిది వారాల్లో రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ అందజేయాలని హైకోర్టు హెచ్చరించిన ఏడాది గడుస్తున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరం. రిటైర్డు ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు. తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులను వేగవంతం చేయాలి.
– సుంకెశీల ప్రభాకర్‌రావు,
రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి