
పేదల కోసమే పనిచేస్తా
● మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
జమ్మికుంట: నిరంతరం పేదల కోసం పని చేస్తానని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పత్తి మార్కెట్లో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనాథపిల్లల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. పేదలకోసం బాల వికాస స్వచ్ఛందసంస్థ కృషి చేయడం అభినందనీయమన్నారు. బాల వికాస ఫౌండర్ బాలథెరిస్సా, సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, లత, మంజుల, జ్యోతి, అముల్య పాల్గొన్నారు.
మహిళా చట్టాల అమలులో నిర్లక్ష్యం
కరీంనగర్: దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలు పని భద్ర త, సమాన పనికి సమాన వేతనం, జీతభత్యం లేని శ్రమ తదితర సమస్యల పరిష్కారానికి అనేక చట్టాలున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం.పద్మశ్రీ అన్నారు. మంగళవారం నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్‌లో మారెళ్ల శ్రీలత అధ్యక్షతన జరిగిన జిల్లా శ్రామిక మహిళా సదస్సులో మాట్లాడారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు హైదరాబాద్‌లో నవంబర్ 1, 2 తేదీ ల్లో 13వ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ర మేశ్, జిల్లా అధ్యక్షుడు ముకుందరెడ్డి ఉన్నారు.
సారఽథి సేవలు షురూ
తిమ్మాపూర్: ఇన్నాళ్లు రవాణా శాఖ సేవలన్నీ రాష్ట్ర వెబ్‌సైట్ ద్వారా నడిచేది కానీ.. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల రవాణా శాఖలను ఏకంచేస్తూ సారథి పోర్టల్ ప్రవేశపెట్టగా.. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలు పైలట్ ప్రాజెక్టు కింద సక్సెస్ అయ్యాయి. తిమ్మాపూర్ లోని ఉమ్మడి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సారధి పోర్టల్ ద్వారా సేవలను ఆ శాఖ అధికారులు ప్రారంభించారు. నూతన పోర్టల్ ద్వారా సేవలన్నీ సులభంగా జరగనున్నాయి. మంగళవారం తిమ్మాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయంలో సారఽథి పోర్టల్ ద్వారా మొట్టమొదటి లెర్నింగ్ లైసెన్స్ ను పొందిన మహిళకు ఎంవీఐ రవికుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ అందజేశారు.
ఆర్టీసీలో దసరా లక్కీ డ్రా
విద్యానగర్(కరీంనగర్): దసరా పండుగ సందర్భంగా ఈనెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆర్టీసీ సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీల క్స్, సూపర్ లగ్జరీ, లహరీ బస్సులతో పాటు అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసినవారికి లక్కీ డ్రా స్కీం అమలు చేస్తున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఈ స్కీంకు సంబంధించి అన్ని ప్రధాన బస్‌స్టేషన్లలో లక్కీ డ్రా బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు తమ ప్రయాణం ముగిసిన తరువాత టికెట్ వెనుక భాగంలో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ రాసి బాక్స్‌లో వేయాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 4గంటలకు లక్కీ డ్రా తీస్తామని, మొదటి విజేతకు రూ.25వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10వేలు చెక్కురూపంలో అందిస్తామని వివరించారు.
దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2025 సంవత్సరానికి గాను షెడ్యుల్డ్ కులాల అభివృద్ధిశాఖ ద్వారా నిర్వహించబడుచున్న ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం’ ద్వారా విద్యార్థులకు రూ.20లక్షలు స్కాలర్‌షిప్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఎం.నగైలేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా న్యూజిలాండ్ విశ్వ విద్యాలయాల్లో చదివేందుకు ఆసక్తి ఉన్నవారు నవంబర్ 19వ తేదీ వరకు www. telangana. epass. cgg. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై నవారికి రూ.20లక్షలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

పేదల కోసమే పనిచేస్తా