
అక్రమ ఇంటి నంబర్లు తొలగించాలి
కరీంనగర్ కార్పొరేషన్: నిర్మాణాలు లేని స్థలాలకు ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగర పాలకసంస్థలో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ సెక్షన్ల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆస్తిపన్ను వసూళ్లు, అండర్ అసెస్‌మెంట్, అన్ అసెస్‌మెంట్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్, యూజర్ చార్జీల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్, నిర్మాణాలు లేకుండా ఇంటి నంబర్లు, ప్రభుత్వస్థలాల్లో అక్రమ నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు లేకుండా ఇంటి నంబర్లు ఇచ్చినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే అలాంటి ఇంటినంబర్లను రద్దు చేయాలన్నారు. రెసిడెన్షియల్స్‌లో వ్యాపారాలు చేస్తుంటే కమర్షియల్‌కు మార్చాలన్నారు. వార్డు అధికారులు డివిజన్లవారిగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో గుర్తించి, వివరాలను రిజిష్టర్‌లో పొందుపరిచాలన్నారు. ట్రాన్స్‌కో కమర్షియల్ మీటర్ల ఆధారంగా సర్వే చేసి రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్‌కు మార్చి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. బకాయిలు చెల్లించనివారికి నోటీసులు జారీ చేసి, నల్లా కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ దిలీప్‌కుమార్, డీసీపీ బషీరొద్దీన్, ఏసీపీ వేణు పాల్గొన్నారు.
ఏక్‌దిన్.. ఏక్ గంటా.. ఏక్ సాథ్
స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా ఈ నెల 25వ తేదీన గంటపాటు సామూహిక శ్రమదాన కార్యక్రమాన్ని నగరపాలకసంస్థ నిర్వహిస్తోంది. ఏక్ దిన్...ఏక్ గంటా..ఏక్‌సాథ్ పేరిట ఈ శ్రమదానం చేపట్టింది. మానేరు డ్యాం సమీపంలోని ఐటీ టవర్ వద్ద దాదాపు వేయి మందితో ఒకే సారి గంటపాటు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆవిష్కంచారు.
ప్రతీ నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లు
సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని మానేరు డ్యాం ప్రాంతంలో గౌతమినగర్, లేక్ పోలీసుస్టేషన్, సీఎం పాయింట్, మార్కండేయకాలనీ, హస్నాపూర్, బతుకమ్మ కాలనీ పాయింట్లను పరిశీలించారు. అన్ని పాయింట్ల వద్ద నేలను చదును చేయడంతో పాటు, లైటింగ్ సిస్టమ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.