
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
అందరిలా ఆలోచన చేస్తే ప్రత్యేకతేముంది..? కొత్తదనం ఉంటేనే ప్రతిభ తెలుస్తుంది. అందుకే వాళ్లు వినూత్నంగా ఆలోచించారు. మెదడుకు పదును పెట్టారు. అనుకున్నది ఆచరణలో పెట్టి సక్సెస్ అయ్యారు. అందరికీ ‘ఆదర్శంగా’ నిలిచారు. ఎఫ్‌ఎం రేడియో ప్రారంభించి ప్రతీరోజూ లంచ్ విరామ సమయంలో వినండి.. వినండి.. అంటూ పలుకరిస్తున్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థులు.
ధర్మారం(పెద్దపల్లి): తరగతి గదుల్లో విద్యార్థుల అల్లరి తగ్గించడం, క్రమశిక్షణ పెంపొందించడం, ఉత్సాహంగా, ఉల్లాసంగా చదువుకోవడం, ఆధునిక ప్రపంచాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. తొలిప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. వినూత్నంగా, ఆసక్తిగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో రేడియో జాకీలుగా పాల్గొనేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025