
లడ్డూ.. అ‘ధర’హో
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్ కల్చరల్/సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌లోని పలు మండపాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట అ‘ధర’హో అనిపించింది. రేకుర్తి కాళోజీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను రూ.1.85 లక్షలకు సంకిటి స్వరూప శ్రీని వాస్‌రెడ్డి దంపతులు దక్కించుకున్నారు. సూర్యనగర్– 3 వినాయకుడి లడ్డూను రూ.1.82లక్షలకు శనిగరపు మంజుల నర్సయ్య దంపతులు దక్కించుకున్నారు. రేకుర్తి ద్వారకానగర్‌లోని శ్రీ అమృతేశ్వర మహాశివాలయంలోని లడ్డూను రూ.42,500లకు కొత్త శ్రీనివాస్ దంపతులు, సూర్యనగర్ (శుభంగార్డెన్) లడ్డూను రూ.37,516లకు వుల్లెంగుల మౌనిక సాయిరాం, సీతారాంపూర్ బాలాజీనగర్ లడ్డూను రూ.21,500లకు తిరుణహరి సురేఖ ప్రశాంత్ దంపతులు కై వసం చేసుకున్నారు. నగరంలోని పాత బజార్ ఒకటోనంబర్ వినాయకుడి లడ్డూను సీనియర్ కరాటే మాస్టర్ కె.వసంత్ కుమార్ రూ.20వేలకు దక్కించుకున్నారు. కోతిరాంపూర్ వినాయకుడి లడ్డూ రూ.9999 పలికింది. భాగ్యనగర్ యూత్ ఆధ్వర్యంలోని లడ్డూను రూ.30,116కు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కూతురు రిషితారెడ్డి దక్కించుకున్నారు.