
అధికారుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం
కరీంనగర్‌రూరల్: డిపార్ట్‌మెంట్ అధికారుల వేధింపులు భరించలేక ఓ కానిస్టేబుల్ సోమవారం పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. దుర్శేడ్‌కు చెందిన గుజ్జేటి మనోహర్ చొప్పదండి ఫైర్‌స్టేషన్‌లో ఫైర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు డ్యూటీల పేరిట వేధిస్తున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారు. సోమవారం అధికారులు పలు రకాలుగా వేధింపులకు గురిచేయడంతో మనోహర్ ఇరుకుల్ల శివారులో పురుగులమందు తాగి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మనోహర్ నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు.