
బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు
● నిల్వ పదార్థాలు గుర్తింపు
కరీంనగర్ అర్బన్: ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బస్టాండ్ పక్కన గల నటరాజ్ బార్, దర్బార్ బార్‌లో గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి.రోహిత్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి.అంకిత్‌రెడ్డి తనిఖీలను నిర్వహించారు. దర్బార్ బార్‌లో ముందు రోజు మిగిలిన మటన్, కార్న్, వెజ్ మంచూరియాను గుర్తించారు. హైజీన్ లోపాలు గుర్తించగా నోటీసులు జారీ చేశారు. అలాగే నటరాజ్ బార్‌లో పరిసరాల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు. కిచెన్ దుర్వాసన రాగా, సిబ్బంది ఎటువంటి ఆహార భద్రత జాగ్రత్తలు పాటించకపోవడంతో నోటీస్ జారీ చేసినట్లు వివరించారు.