
నిషేధిత భూములకు నో రిజిస్ట్రేషన్
● ఆ భూముల జాబితా నవీకరించాలి ● రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్‌శాఖలు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్ పమేలా సత్పతి
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
నిషేధిత జాబితా భూములను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ భూముల జాబి తాను నవీకరించాలని, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ము న్సిపల్‌శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభు త్వ నిబంధనలను అనుసరించి రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. నిషేధిత జాబితా సర్వే నంబర్లను క్రోడీకరించి, నవీకరించిన సమగ్ర జాబితా సిద్ధం చేయాలని, అన్నిశాఖల అధికారుల వద్ద నవీకరించిన నిషేధిత భూముల జాబితా ఉండాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు నిర్ణయించాలని మున్సిపల్, రెవె న్యూ అధికారులను ఆదేశించారు. ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి వస్తే నిర్దిష్ట డాక్యుమెంట్లతో పాటు మున్సిపల్ లేదా గ్రామపంచాయ తీ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలన్నారు. ప్రజలు భూ ములు కొనుగోలు చేసే ముందు నిషేధిత జాబితా లో ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ వర్సెస్ జిల్లా రిజిస్ట్రార్
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో జిల్లా ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపం కనిపిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్‌లో రిజిస్ట్రేషన్‌శాఖ ఎ లాంటి పొరపాట్లు చేయదని, రెవెన్యూశాఖ తమకు నిషేధిత భూముల సమాచారం ఇవ్వడంలో సమన్వయం లోపంతోనే తాము నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తోందని ఇటీవల జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపిన విషయం తెలిసిందే. ఒకదశలో సస్పెండ్ అయిన గంగాధర సబ్‌రిజిస్ట్రార్ నూర్ అప్జల్‌ఖాన్‌ను గతంలో సస్పెండ్ అయిన హుజూరాబాద్ సబ్ రిజిస్ట్రార్లను సమర్థించడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఇదే విషయంపై కలెక్టర్ తాజాగా సీరియస్ అయ్యారు. కొనుగోలుదారులు ఇబ్బందులు పడకుండా నిషేధిత భూముల జాబితాను రిజిస్ట్రేషన్ ఆఫీసుల ఎదుట ప్రదర్శించాలని ఆదేశించారు.
బాధితులకు న్యాయమెలా?
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇంతకాలం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్‌శాఖ అధికా రుల సమన్వయ లోపం ఉందని ఉన్నతాధికారులు అంగీకరించినట్లయింది. కొన్నేళ్లుగా జిల్లాలో ఏవి ప్రభుత్వ భూములు, నిషేధిత భూములో సరిహద్దులు తెలిపే ఏర్పాట్లు లేకపోవడంతో భూబకాసురులు ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా విక్రయించారు. నిషేధిత భూముల క్రయ, విక్రయాలు జరుగకుండా కలెక్టర్ పమేలా సత్పతి చొరవ తీసుకోవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. రేకుర్తి, కొత్తపల్లి, తదితర ప్రాంతాల్లో ఇన్నేళ్లుగా నిషేధిత భూములలో జరిగిన క్రయ, విక్రయాలపై ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత భూములు కొనుగోలు చేసి రోడ్డునపడ్డవారికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్‌శాఖల్లో ఎవరు న్యాయం చేస్తారన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

నిషేధిత భూములకు నో రిజిస్ట్రేషన్

నిషేధిత భూములకు నో రిజిస్ట్రేషన్