
ముఖ గుర్తింపు హాజరు పెంచాలి
● ఎంఈవోలు మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, రాష్ట్ర మోడల్ స్కూల్స్ ప్రిన్సి పాళ్లు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు 85శాతానికి తగ్గకుండా ఉండాలని అన్నారు. తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల హాజరు శాతాన్ని తెలియజేయాలని, రోజు పిల్లల్ని పంపించే విధంగా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని ఆదేశించారు. హరిత విద్యాలయ రిజిస్ట్రేషన్లలో జిల్లా ప్రథమస్థానంలో నిలవాలని సూచించారు. మండల విద్యాధి కారులు జిల్లాలోని పాఠశాలలు, మోడల్ స్కూ ళ్లు, కేజీబీవీలను తరచూ సందర్శిస్తూ అల్పాహా రం, మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీ లించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి పాల్గొన్నారు.
రోగులకు ఇబ్బంది ఏర్పడొద్దు
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగం, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. వైద్య సేవలు, పలు సౌకర్యాలను పరిశీలించారు. ఐసీయూ, వార్డులు, ఆపరేషన్ థియేటర్‌ను సందర్శించారు. క్రిటికల్ కేర్ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్‌లైన్ సమకూర్చుకోవాలని ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఓపీ విభాగం, స్కానింగ్ గదిని పరిశీలించారు. గర్భిణులతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగంలో ఉక్కపోతతో గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభు త్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ నవీనా పాల్గొన్నారు.